మొయినాబాద్‌రూరల్: ఎలినినో పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణ ఉద్యమంలా చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. మండలంలోని నాగిరెడ్డిగూడలో మంగళవారం సర్పంచ్ కీసరి పద్మసంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ ఆవరణలో ఇంకుడు గుంత పనులు ప్రారంభించి మొక్క నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరని సూచించారు. రైతులు పొలాల్లో పంటకుంటలు నిర్మించుకోవాలని, గ్రామానికి ఒక ఊటకుంట, బోరుబావుల రీచార్జీ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ సురేష్‌మోహన్, ఎంపీడీవో హిమబిందు, ఎంపీవో విక్రాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఎర్ర జైపాల్, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈవో దీనా, పంచాయతీ కార్యదర్శులు మల్లేష్‌గౌడ్, కళ్యాణ్, వార్డు సభ్యులు లతఅర్జున్, వనజవిజయ్‌కుమార్, యాద య్య, రాజు, విజయ్‌రాజ్, నిరోషావికాస్, మధు కర్, రోజామహేందర్, శశిధర్, నాయకులు కొత్త సంజీవరెడ్డి, రేషన్ డీలర్ సుజాత పాల్గొన్నారు.
విద్యార్థులు లక్ష్యాన్ని సాధించాలి
విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యా సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
అదనపు కలెక్టర్ కిరణ్మయి


