స్సీకర్‌కు శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

స్సీకర్‌కు శుభాకాంక్షలు

Jan 3 2026 8:38 AM | Updated on Jan 3 2026 8:38 AM

స్సీక

స్సీకర్‌కు శుభాకాంక్షలు

కుల్కచర్ల: గ్రామాల్లో సమాఖ్య భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. ముజాహిద్‌పూర్‌ గ్రామంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ప్రభుత్వ స్థలం అవసరం ఉందని.. గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిని గుర్తించి అబివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముజాహిద్‌పూర్‌ సర్పంచ్‌ చంద్రభూపాల్‌, కార్యదర్శి సంతోశ్‌, ఘణపూర్‌ సర్పంచ్‌ రవీందర్‌, గిర్దవరి రవి, నాయకులు భీమయ్య, భాస్కర్‌, వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌ శాసన సభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

పుష్పగుచ్ఛం అందజేసి.. అవగాహన కల్పించి

పరిగి: ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంవీఐ వీరేంద్రనాయక్‌ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన వాహనదారులకు పుష్పగుచ్ఛం అందజేసి, అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, పోర్‌ వీలర్‌ చోదకులు సీటుబెల్టు పెట్టుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వ స్థలాలు గుర్తించండి

ఏఎంసీ చైర్మన్‌ ఆంజనేయులు

స్సీకర్‌కు శుభాకాంక్షలు 1
1/1

స్సీకర్‌కు శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement