ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కడ్తాల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేస్తోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముద్వీన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో టీఎస్ యూటీఎఫ్ కడ్తాల్ మండల శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాల్‌నాయక్ మాట్లాడుతూ అధ్యాయనం, ఆధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో హక్కులు బాధ్యతలు ఉద్యమ నేత్రాలుగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఎస్‌యూటీఎఫ్ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నిర్మల, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఉపాధ్యక్షుడు మల్లయ్య, సభ్యులు నర్సింహ మూర్తి, రాజు, సత్యనారాయణ, రఘుపతి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్


