అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్
అబ్దుల్లాపూర్‌మెట్: అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ‘మైనింగ్ మాఫియా’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించారు. మట్టి మాఫియాపై కొరడా ఝళిపించారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కోహెడ రెవెన్యూ పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను సీజ్ చేశారు. మట్టి తరలింపునకు పాల్పడుతున్న నరహరి, సత్తయ్య, ఆనంద్ అనే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.


