పెండింగ్ వేతనాలు చెల్లించాలి
మొయినాబాద్: మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్ డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ నెల 5వ తేదీలోపు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, నూతన యూనిఫాం, గుర్తింపు కార్డులు, సబ్బులు, నూనెలు, ఈఎస్‌ఐ కార్డు, పీఎఫ్ నంబర్ వంటి అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, మండల కన్వీనర్ ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ గౌరవ అధ్యక్షుడు రత్నం, అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, సురేష్, కోశాధికారి కృష్ణ పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్


