తలసీమియా బాధితులకు అండగా నిలవాలి
హుడాకాంప్లెక్స్: తలసీమియా బాధిత చిన్నారులకు అండగా నిలవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సరూర్‌నగర్‌లోని అమితాబ ఆదరణ విద్యాలయంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్తదానంతో ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. తలసీమియా బాధితుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభి నందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వివేక్ యాస్కి, సాకేత్ చిట్టిమల్ల, ఉపేందర్ గుప్తా, ప్రవీణ్, రాహుల్ గుప్తా, పారితాల సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్, నారాయణ పేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్‌జైన్, సిక్తా పట్నాయక్, వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్ర, సీఎంఈఓ అధికారి వాసుదేవరెడ్డి తదితరులు ఎన్కేపల్లి గేటు సమీపంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్‌షెడ్ నిర్మాణ పనులకు సీఎం భూమిపూజ చేస్తారు. బొంరాస్‌పేటలో గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం, హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్, సైనిక్‌స్కూల్ నిర్మాణ పనులకు సామూహిక శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆదివారం భారీగా పోలీసులు మోహరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మొగులప్ప, సబ్‌కలెక్టర్ సుధీర్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీపీఎం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
హకీంపేట్‌లో ఏరియల్ సర్వే
దుద్యాల్: సీఎం దుద్యాల్ మండలం హకీంపేట్‌లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించే అవకాశం ఉందని ఎడ్యుకేషన్ హబ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హకీంపేట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హకీంపేట్ పర్యటన రద్దయిన నేప థ్యంలో హెలిక్యాప్టర్ నుంచి విద్యాలయాలకు కేటాయించిన స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ హబ్ డీఈఈ పీ రాజయ్య, ఏఈ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిగి: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆరోపించారు. లేబర్ కోడ్ల నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ఆదివారం పట్టణంలో కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. మోదీ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసి కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తోందని ఆరోపించారు. పెన్షన్, సహజ మరణాలకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
తలసీమియా బాధితులకు అండగా నిలవాలి
తలసీమియా బాధితులకు అండగా నిలవాలి


