
నేరాల కట్టడిలో ‘సీసీ’లు కీలకం
శంషాబాద్ అదనపు డీసీపీ పూర్ణచందర్
ఆమనగల్లు: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని శంషాబాద్ అదనపు డీసీపీ పూర్ణచందర్ అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలు, మండల పరిధిలోని గట్టుప్పలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రజల భద్రతకు నూతన అడుగు అన్నారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో కెమెరాలు కీలకంగా పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆమనగల్లు సీఐ జానకీరాంరెడ్డి, తలకొండపల్లి ఎస్‌ఐలు శ్రీకాంత్, శేఖర్, మాజీ సర్పంచ్ జ్యోతయ్య, కానిస్టేబుల్ జాషువ తదితరులు పాల్గొన్నారు.
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
ఆమనగల్లు పట్టణంలోని సురసముద్రం చెరువు వద్ద వినాయకుల నిమజ్జన ఏర్పాట్లను శంషాబాద్ అదనపు డీసీపీ పూర్ణచందర్ పరిశీలించారు. నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మున్సిపల్ సిబ్బంది, పోలీసుశాఖ సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.