
జై
న్యూస్‌రీల్
24.12 ఎకరాలకు ఫెన్సింగ్ 24.12 ఎకరాల ప్రభుత్వ భూమికి రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ చేశారు.
మట్టి గణపతికి
భక్తుల ఆలోచనా ధోరణి మారింది. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ప్రమాదకరమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, సింథటిక్ కలర్లతో తయారు చేసిన ఎత్తయిన విగ్రహాలకు బదులు స్వచ్ఛమైన బురద మట్టితో తయారు చేసిన ప్రతిమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మేరకు వాటి విక్రయాలు సైతం జోరందుకున్నాయి.
● వినాయక ఉత్సవాల్లో పర్యావరణానికి పెద్దపీట
● మారుతున్న మండప నిర్వాహకుల ఆలోచనా ధోరణి
● మార్కెట్లో విరివిగా మట్టి విగ్రహాల విక్రయాలు
● ఆరు అంగుళాల నుంచి ఐదు అడుగుల ఎత్తు వరకు..
● రూ.150 నుంచి రూ.14 వేల వరకు ధర
హుడాకాంప్లెక్స్: వినాయక విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడంపై పర్యావరణవేత్తలు, న్యాయస్థానాలు ఆందోళన వ్యక్తం చేయడం.. పలు రకాల ఆంక్షలు విధించడం తెలిసిందే. ఎత్తయిన విగ్రహాల కొనుగోలు, రవాణా, మండపం ఏర్పాటు, ప్రతిష్ఠాపన, ఘనమైన పూజల నిర్వహణ, నిమజ్జనం వంటి అంశాల్లోనూ ఇబ్బందులు తలెత్తుతున్న విషయం విధితమే. కొన్ని సందర్భాల్లో భక్తులు ప్రమాదాలకు గురైన సంఘటనలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తగత భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటు పడేవిధంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.
కొనుగోళ్లకు ఆసక్తి
గతంలో ప్రధాన రోడ్లు, షాపుల్లో ఎటు చూసినా రంగులు అద్దుకున్న గణనాథుల విగ్రహాలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం మట్టి విగ్రహాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఆరు అంగుళాల నుంచి ఐదు అడుగుల ఎత్తు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో విగ్రహం ఎత్తు, సైజును బట్టి రూ.150 నుంచి రూ.14 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇతర విగ్రహాలతో పోలిస్తే దరలు కాస్త తక్కువగా ఉండటం, పర్యావరణహితంగా విగ్రహాలను తయారు చేయడంతో మెజార్టీ భక్తులు వీటి కొనుగోళ్లకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నారు.
మండపాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించే వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరని నిపుణులు పేర్కొంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. విగ్రహాల తరలింపు, మండపం ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు, నిమజ్జనం వరకు ఇలా ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
● మండపం ఏర్పాటుకు నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి పొందాలి.
● మండపాలకు విద్యుత్ కనెక్షన్లు నేరుగా తీసుకోరాదు. డిస్కం ఇంజనీర్లకు సమాచారం ఇచ్చి, వారి అనుమతి మేరకే తీసుకోవాలి. స్తంభాలను నేరుగా ఎక్కడం కానీ, లైన్లకు వైర్లను వేలాడదీయడం కానీ చేయరాదు.
● లైన్ల కింది నుంచి విగ్రహాలను తరలించే సమయంలో తడిసిన కర్రలతో కానీ ఇనుప రాడ్లతో కానీ వైర్లను తాకరాదు. అలా తాకడం ద్వారా విద్యుత్‌షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
● సాధారణంగా మండపంలో లైటింగ్ కోసం వైర్లకు అనేక చోట్ల జాయింట్లు వేస్తుంటారు. విద్యుత్ సామర్థ్యం మేరకు ఎంపిక చేసుకోవడంతో పాటు జాయింట్లు లేకుండా చూసుకోవాలి.
● ఎంసీబీలను విధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత ఇంజనీరుకు/ లైన్‌మెన్‌కు సమాచారం ఇవ్వాలి.
● రాత్రి పూట విగ్రహాలకు కాపలాగా నిర్వాహకులతో పాటు పోలీసు గస్తీ ఉండేలా చూసుకోవాలి.
● డీజే, ఇతర సౌండ్ సిస్టం ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ సిస్టం నిలిపివేయాలి. లేదంటే స్థానికుల నుంచి పోలీసుస్టేషన్లకు ఫిర్యాదు లు వెళ్లి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

జై

జై