షాద్‌నగర్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్‌లో ఈనెల 25న సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్టు బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లిలో శని వారం బీసీ సేన జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీనివాస్ అధ్యక్షతన బీసీ సేన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలంతా కలిసికట్టుగా పోరాటం చేస్తేనే రాజ్యాధికారం సాధ్యమని అన్నారు. బీసీల హక్కుల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా ఆర్.కృష్ణయ్య పోరాటం చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. బీసీలంతా దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మేకల వెంకటేశ్, సుధాకర్, చంద్రశేఖర్, పాలాది శ్రీనివాస్, బాస వరలక్ష్మి, భూషణ్, నరేష్, చందూలాల్, శంకర్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ