
సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: సీఎస్‌ఆర్ నిధులతో మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు అడిషనల్ కలెక్టర్ (ప్రత్యేకాధికారి) శ్రీనివాస్ సూచించారు. ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాతంగా జరుపుకొనేలా చూడాలన్నారు. సమన్వయంతో సమ స్యలు లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, మేనేజర్ రమేష్, టీపీఓ అబీబున్నీసాబేగం, డీఈ స్వర్ణకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మీర్‌పేట: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను శనివారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ మున్సిపల్, విద్యుత్, పోలీసు, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ఎ.నాగమణి, ఏఎంసీ నాగేందర్‌రెడ్డి, సీఐ శంకర్‌నాయక్, ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆమనగల్లు: గణేశ్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ కోరారు. పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో శనివారం శాంతి, సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీలు గణేశ్ మండపాల ఏర్పాటు కోసం అనుమతి తీసుకోవాలని అన్నారు. మండపాల వద్ద అనుమతించిన డెసిబుల్స్ శబ్దం కల సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేసుకోవాలని, ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, శాంతిభద్రతలకు ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఆమనగల్లు ఇన్‌చార్జి సీఐ గంగాధర్, ఎస్‌ఐ వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ శంకర్, విద్యుత్‌శాఖ ఏఈ శంకర్‌నాయక్, ఆర్‌అండ్‌బీ ఏఈ తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ రెహమాన్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంపత్, మైనర్ ఇరిగేషన్ ఏఈ తిరుపతయ్య, ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
నందిగామ: నందిగామ తహసీల్దార్ రాజేశ్వర్ కలెక్టరేట్‌కు బదిలీ ఆయ్యారు. ఆయన స్థానంలో మహేశ్వరం మండల తహసీల్దారుగా ఉన్న సైదులు రానున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. శనివారం అమావాస్య కారణంగా ఆయన బాధ్యతలు చేపట్టలేదు. సోమవారం రాజేశ్వర్ రిలీవ్ కానుండడంతో అదేరోజు సైదులు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇబ్రహీంపట్నం: బీసీల చైతన్యమే లక్ష్యంగా మన ఆలోచన సమితి సమితి (మాస్) పనిచేస్తుందని సమితి రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింఽగ్‌రావు అన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం బీసీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన కోసం, మన పిల్లల కోసం, మన అందరి విముక్తి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం దక్కే వరకు అలుపెరగని పొరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీల్లోని వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.

సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి చేయండి