
● పెళ్లిలో తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
● ఎల్లలు దాటి వచ్చి..
మొయినాబాద్: అన్నా చెల్లెలు, అక్కా తమ్ముల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. సోదరులు ఎక్కడు న్నా అక్కాచెల్లెళ్లు అక్కడికి వెళ్లి రాఖీ కట్టి తమ అనుబంధాన్ని చాటుకుంటారు. పెళ్లి వేడుకలోనే వరుడు (తమ్ముడు)కి రాఖీ కట్టి రక్షాబంధన్ విశిష్టతను చాటిచెప్పింది ఓ సోదరి. గతంలో మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం ఏసీబీ నిజామాబాద్ డీఎస్పీగా పనిచేస్తున్న శేఖర్‌గౌడ్ కూతురు నిషిత, కేశంపేటకు చెందిన అన్వేష్‌రెడ్డి వివాహ వేడుక శనివారం మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని స్టార్ కన్వెన్షన్‌లో జరిగింది. పెళ్లి వేడుకలోనే అన్వేష్‌రెడ్డికి అక్క మౌనిక రాఖీ కట్టి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏసీపీ డీజీ విజయ్‌కుమార్, ఐపీఎస్ అధికారి కోటిరెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.