
● హెల్మెట్ ధరించని వాహనదారులకు..
● పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్
● ఆర్టీసీ.. ఫుల్ గి‘రాఖీ’
పహాడీషరీఫ్: రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వాహనదారులకు బాలాపూర్ పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి రాఖీలు కట్టారు. హెల్మెట్ ధరించకుండా పుట్టింటికి భర్తలతో వెళ్తున్న వాహనాలను గుర్తించి హెల్మెట్ ధరించాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే ఏడాది రాఖీలు కట్టలేకపోతారని అవగాహన కల్పించారు. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ ఆధ్వర్యంలో రాఖీ శుభాకాంక్షలు తెలిపి మరీ మహిళా పోలీస్ అధికారులతో రాఖీలు కట్టించారు.