
స్వచ్ఛ శంకర్‌పల్లిలో భాగస్వాములుకండి
శంకర్‌పల్లి: మున్సిపల్ ప్రజలంతా స్వచ్ఛ శంకర్‌పల్లిలో భాగస్వాములు కావాలని సినీ నటుడు సునీల్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 100 రోజుల పట్టణ ప్రణాళికలో భాగంగా ఆయన సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ మున్సిపల్ శాఖ ‘మా ర్పు– అభివృద్ధికి మలుపు’ నినాదంతో ముందుకు వెళ్తూ.. 100 రోజుల ప్రణాళిక చేపట్టిందని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోల్లో వేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, అవకాశం ఉన్నచోట విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ‘స్వచ్ఛ తెలంగాణ– స్వచ్ఛ శంకర్‌పల్లి’ కోసం ప్రతి ఒక్కరం కృషి చెద్దామన్నారు.