
బీసీల్లో ఐక్యత అవసరం
షాబాద్: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని బోడంపహాడ్‌లో బీసీ సేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా వెంకటేశ్, ఉపాధ్యాక్షులుగా లింగం, ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా చాకలి శ్రీనివాస్, కార్యదర్శులుగా మహేష్, లక్ష్మణ్, కోశాధికారిగా హరీశ్‌గౌడ్, కార్యదర్శిగా లక్ష్మణ్‌కు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాల్లో రాణించాలంటే గ్రామస్థాయి నుంచే ఐక్యంగా ఉండాలన్నారు. ప్రపంచ జనాభాలో 70శాతం ఉన్న బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారన్నారు. ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బర్క కృష్ణ నేతృత్వంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసేన మండల మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్‌చారి, యూత్ అధ్యక్షుడు అజయ్‌కుమార్, నాయకులు బాల్‌రాజ్, ఇనాయత్, అబ్బాస్ తదితరులున్నారు.
బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ