
అయ్యవారిపల్లి వాగులో వరద ఉధృతి
షాద్‌నగర్‌రూరల్: భారీ వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. చించోడ్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రదంలోకి వర్షపు నీరు చేరింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీడీఓ బన్సీలాల్ శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రం, వాగు పరిసరాలను పరిశీలించారు. వాగు సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రజలు వాగు సమీపంలోకి రావద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయ్యవారిపల్లికి ప్రయాణించేవారు మరో మార్గం ఎంచుకోవాలని చెప్పారు. వాగును పరిశీలించిన వారిలో ఎంపీఓ జయంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
రాకపోకలు నిలిపివేసిన అధికారులు