
రైస్‌మిల్ నుంచి రసాయన వ్యర్థాలు
ఇబ్రహీంపట్నం రూరల్: రైస్‌మిల్ మూసి వేయాలని ఉప్పరిగూడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని ఉప్పరిగూడలో గురువారం శ్రీనివాస రైస్ మిల్ నుంచి నాలుగు ట్యాంకర్లకు పైగా రసాయన వ్యర్థాలను రోడ్డుపైకి వదిలారు. పోచారం వరకు ఈ వ్యర్థాలు పారుతుండడంతో రాకపోకలు సాగించిన వారు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రైస్‌మిల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టి అనుమతులు లేకుండా పరిశ్రమ నెలకొల్పారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిల్లు యజమానికి సమాధానం ఇవ్వకుండానే అక్కడ నుంచి వెనుదిరిగారు. ఈ ఆందోళనలో ప్రభాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శివకుమార్, మంత్రి శ్రావణ్, మోహన్‌రెడ్డి, కృష్ణ, మహేందర్, సుక్రు, గ్రామస్తులు పాల్గొన్నారు .
దుర్గంధంతో ఇబ్బంది పడిన స్థానికులు
ఆందోళన చేపట్టిన ఉప్పరిగూడ గ్రామస్తులు