
మరణంలోనూ జంటగా..
షాబాద్: ఆ అన్యోన్య దంపతుల బంధాన్ని మృత్యువు సైతం వేరు చేయలేకపోయింది. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య గంటల వ్యవధిలోనే ప్రాణాలు వదిలేసింది. ఈ ఘటన హైతాబాద్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన అన్నె ప్రసాద్‌రావు(83), పార్వతి (72) దంపతులు హైతాబాద్‌లో ఉంటున్నారు. బుధవారం రాత్రి ప్రసాద్‌రావు అస్వస్థతకు గురికావడంతో శంషాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషయం తెలియగానే తీవ్ర మానసిక క్షోభకు గురైన పార్వతి గుండెపోటుతో మరణించింది. స్థానిక శ్మశానవాటికలో గురువారం ఇద్దరి అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.