
పట్టణాలను హరిత వనాలుగా మార్చాలి
సీడీఎంఏ డైరెక్టర్ జోత్స్న
షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవంతో పట్టణాలు పచ్చని వనాలుగా మారాలని సీడీఎంఏ డైరెక్టర్ జోత్స్న అన్నారు. గురువారం మున్సిపల్ పరిధి 10వ వార్డులోని ప్యారడైజ్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ సునీత ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మొక్క నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించాలని కోరారు. సకాలంలో వర్షా లు కురవాలన్నా.. వాతావరణ సమతుల్యత కాపాడాలన్నా.. మొక్కల పెంపకం అవసరమన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వనమహోత్సవంలో భాగస్వాములై ప్రతి ఇంటికి మొక్క నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రావణి, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ బోధనతో
విద్యార్థుల విజయం
రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ వెంకటేశ్
మాడ్గుల: ఉత్తమ బోధనతో విద్యార్థుల విజ యం సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఇర్విన్ జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్ త్రిబుల్ ఐటీ, ఎన్‌ఎమ్‌ఎస్‌కు ఎంపికై న విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో ఇర్విన్ విద్యార్థుల సత్తా అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుల ప్ర ణాళికాయుత బోధనతోనే విజయాలు సాధ్యమవుతున్నాయని కితాబిచ్చారు. సమాజంతో పాటు వ్యక్తిగతంగానూ గుర్తింపు పొందాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం హెచ్‌ఎం పర్వతాలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుశీంధర్ రావు, ఏంఈఓ సర్ధార్ నాయక్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సినీ హీరో గోపీచంద్
శంకర్‌పల్లి: సినీ హీరో గోపీచంద్ గురువారం శంకర్‌పల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి విచ్చేశారు. మండల పరిధిలోని బ్లూమ్స్ వెంచర్‌లో ఉన్న 400 గజాల విల్లా విక్రయానికి గాను ఆ యన కార్యాలయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. దీంతో ఒకింత ఇబ్బంది పడిన గోపీచంద్ పని పూర్తయిన వెంటనే పట్టణ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.
గంజాయి పట్టివేత
సాక్షి, సిటీబ్యూరో: దాదాపు రూ.6 లక్షల విలువైన 11.5 కిలోల గంజాయిని ఎకై ్సజ్ పోలీసు లు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా సరూర్‌నగర్ చైతన్యపురికి చెందిన భూక్య శ్రీకాంత్ వద్ద 340 గ్రాముల గంజాయిని మొదట పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు అబ్బాస్ అనే వ్యక్తి వద్ద నుంచి 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు. అబ్బాస్ ఇచ్చిన సమాచారం మేరకు నడిమింటి మమత అనే మహిళ ఇంట్లో 10.693 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి మొత్తం 11.5 కిలోలు పట్టుకున్నట్లు రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ తెలిపారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.