చంద్రమౌలికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

చంద్రమౌలికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డు

Aug 8 2025 9:13 AM | Updated on Aug 8 2025 9:13 AM

చంద్రమౌలికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డు

చంద్రమౌలికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డు

ఆమనగల్లు: నగరంలోని పీపుల్స్‌ ప్లాజాలో గురువారం జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాడ్గుల మండలం కొల్కుపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు గుర్రం చంద్రమౌలికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో సహజ రంగులతో నూతన డిజైన్‌లో ఇక్కత్‌ పట్టుచీర నేసిన చేనేత జిల్లా కళాకారుడు చంద్రమౌలిని అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రశంసాపత్రం, రూ.25వేల విలువైన చెక్కు, మెమొంటో అందజేశారు. అనంతరం చంద్రమౌళిని పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు అశోక్‌, నాయకులు కృష్ణయ్య, ప్రవీణ్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్‌కుమార్‌, రాజేశ్‌, భాస్కర్‌, వెంకన్న, సాయి, శశికళ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement