
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చేవెళ్ల: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ అన్నారు. చేవెళ్లలోని ఆదర్శ పాఠశాలలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ, కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణంపై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించాలని అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మోహిదీన్, ప్రిన్సిపాల్ చిన్నపురెడ్డి, యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం జిల్లా కో ఆర్డినేటర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆడిట్‌లో తప్పుల గుర్తింపు
సామాజిక తనిఖీలో వెల్లడి
కందుకూరు: మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గ్రామీణ ఉపాధిహామీ పథకం 2024–25 సంవత్సరానికి సంబంధించి 12వ విడత సామాజిక తనిఖీని డీఆర్‌డీఓ శ్రీలత ఆధ్వర్యంలో మంగళవారం అధికారులు నిర్వహించారు. మొత్తం మండలంలో ఈజీఎస్ కింద కూలీలు, మెటీరియల్ ఖర్చులకు రూ.6.28 కోట్లు, పీర్ పనులకు గాను రూ.1.34 కోట్లు, ఫారెస్ట్ కింద రూ.35.18 లక్షలు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అనంతరం పంచాయతీల వారీగా నిర్వహించిన ఆడిట్‌లో గుర్తించిన తప్పులకు సంబంధించి సిబ్బంది నుంచి వివరణ తీసుకున్నారు. కొన్ని గ్రామాల్లో మస్టర్లలో కొట్టివేతలు, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో సంబంధిత సిబ్బందికి జరిమానా కింద రూ.16వేలు విధించారు. మళ్లీ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని డీఆర్‌డీఓ శ్రీలత ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ సుభాషిణి, ఎంపీడీఓ సరిత, అంబుడ్స్‌మన్ సునీత, ఏపీడీ చరణ్, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఎస్‌ఆర్‌పీ కాశయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఈసీలు, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.
స్పాట్ అడ్మిషన్లకు
దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి డిప్లమా, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సులకు ఈనెల 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సిర్టిఫికెట్లతో పాటు వాటి జిరాక్స్ కాపీలను నిర్ధారిత ఫీజుతో ఈనెల 8న ఉదయం 9.30 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారు. మరిన్ని వివరాలకు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
మహేశ్వరం పాలిటెక్నిక్ కళాశాలలో..
మహేశ్వరం: మహేశ్వరం ప్రభుత్వ పాలిటెక్నినిక్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ కోర్సుల్లో 45 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 94901 20175, 72076 83644 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వాహనాల వేలం:
రూ.3.11 లక్షల ఆదాయం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మూడు వాహనాల వేలం పాటలో రూ.3,11,800 ఆదాయం వచ్చినట్లు ఎకై ్సజ్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఒక బజాజ్ ఆటో, రెండు టీవీఎస్ ఎక్సెల్ వాహనాలకు వేలం వేశారు. 38మంది రూ.5వేల చొప్పున డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు.
మొక్కలు నాటుతున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు