
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
జిల్లా వ్యవసాయాధికారి ఉష
కడ్తాల్: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి టి.ఉష అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీని ఆమె పరిశీలించారు. మండల పరిధిలో ఎంత వరకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తయిందో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా చూడాలని, తగినంత నిల్వలు ఉండేలా ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం మైసిగండి గ్రామంలో పర్యటించారు. క్వాలిటీ సీడ్ ఫర్ ఎవ్రీ విలేజ్ (క్యూఎస్‌ఈవీ) పథకంలో లబ్ధిదారుడైన గ్రామానికి చెందిన రామవత్ లక్ష్మణ్‌నాయక్ సాగు చేసిన వరి పంటను పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, రావిచేడ్ గ్రామాల్లో విత్తన, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ శోభారాణి, ఏఓ కవిత, ఏఈఓ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
షాబాద్: పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల సభ్యుడు డాక్టర్ సుశీల్ హరిపాండ్ దేశ్‌ముఖ్, డాక్టర్ కవాస్ ఆనంద్ కృష్ణరాజ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చందనవెల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ ఉప వైద్యధికారి డాక్టర్ నాగేంద్రబాబుతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల నాణ్యతను మెరుగుపర్చాలని, రోగుల్లో నమ్మకం, ప్రజారోగ్య వ్యవస్థలో జవాబుదారీతనం పెంచాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ధిష్ట ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్, డిస్టిక్ట్ క్వాలిటీ మేనేజర్ రాము, సీహెచ్‌ఓ సురేందర్‌నాయక్, వైద్య సిబ్బంది కవిత, నీలవేణి, నవీన్, కమార్, నవీన్, గోపాల్, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.