
రైలు ఢీకొని వ్యక్తి మృతి
కొత్తూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు దూబే.. పదేళ్గుగా కొత్తూరులో నివాసం ఉంటున్నాడు. ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటినుంచి వెళ్లిపోయిన సదరు వ్యక్తి.. గుర్తు తెలియన రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మాస్టర్ రేమత్ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నందిగామలో.. మరొకరు
నందిగామ: బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిని రైలు ఢీ కొట్టగా.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నందిగామ శివారు హెచ్‌బీఎల్ పరిశ్రమ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఐజాక్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం కడ్లాపూర్ గ్రామానికి చెందిన దాడువై అంజయ్య(57) కాలకృత్యాలు తీర్చుకునేందుకు రైలు పట్టాల పక్కకు వెళ్లి తిరిగి వస్తుండగా.. గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ మాస్టర్ ఎండీ ఉబెద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
ఫోన్ అప్పగింత
మహేశ్వరం: 108లో మరిచిపోయిన మొబైల్ ఫోన్‌ను.. అంబులెన్స్ సిబ్బంది రోగి బంధువుకి అప్పగించి నిజాయతీని చాటు కున్నారు. కందుకూరు మండలం మీర్కాన్‌పేట్ గ్రామానికి చెందిన నందిగామ లక్ష్మమ్మ(75) అనారోగ్యానికి గురి కావడంతో బంధువులు అంబులెన్స్‌లో చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో రోగి బంధువులు.. తమ ఫోన్‌ను వాహనంలో వదిలి వెళ్లిపోయారు. మండల కేంద్రం చేరుకున్న వాహన సిబ్బంది.. సెల్‌ను గమనించి రోగి బంధువులకు సమాచారం అందించి అప్పగించారు. దీంతో ఈఎంటీ కుమార్, ఫైలట్ యాదయ్యను వారు అభినందించారు.
పోగొట్టుకున్న డబ్బును కెమెరా పట్టించింది
ఆమనగల్లు: ఓ వ్యక్తి పోగొట్టుకున్న పర్సును సీసీ కెమెరా పట్టించగా.. ఆ పర్సును పోలీసులు ఆదివారం బాధిత వ్యక్తికి అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లికి చెందిన లక్ష్మయ్య తన పర్స్‌లో రూ.16 వేలు పెట్టుకుని, గ్రామీణ వికాస్‌బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యలో పడిపోయింది. బ్యాంక్‌కు వచ్చి చూసుకోగా.. కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సదరు వ్యక్తి ఫిర్యాదుతో ఎస్‌ఐ శ్రీకాంత్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శ్రీనివాస్, శివుడులు ఆయా మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. రోడ్డుపై పడిపోయిన పర్స్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తీసుకున్నట్లుగా గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా వారిని గుర్తించి, పర్సు, అందులోని డబ్బును రికవరీ చేశారు. అనంతరం బాధితుడు లక్ష్మయ్యకు అందజేశారు.
రిజర్వేషన్లు ప్రకటించకపోతే ఎన్నికల బహిష్కరణ
బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్కకృష్ణ యాదవ్
షాద్‌నగర్‌రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించకపోతే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్కకృష్ణ యాదవ్ అన్నారు. ఆదివారం సేన ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడు షాబాద్‌రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో లింగారెడ్డిగూడ గ్రామ సేన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. జనాభాలో బీసీలుఅధిక శాతం ఉన్నారని, రిజర్వేషన్లలో సముచిత స్థానం కల్పించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని పేర్కొన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శంకరయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా అశోక్, మల్లేశ్, వంశరాజ్, ప్రధాన కార్యదర్శులుగా వీరేష్‌గౌడ్, పోచయ్య, శ్రీకాంత్‌తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్, చంద్రశేఖరప్ప, పాలాది శ్రీనివాస్, జయమ్మ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
ఢీ కొరియో గ్రాఫర్ కృష్ణ అరెస్ట్
గచ్చిబౌలి: పోక్సో కేసులో ఢీ షోలో కొరియో గ్రాఫర్‌గా వ్యవహరించిన కృష్ణను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నమ్మకంగా ఉంటూ స్నేహితుడి కూతురిపై లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదు అందడంతో గచ్చిబౌలి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి