చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్‌ మృతి

Aug 3 2025 8:50 AM | Updated on Aug 3 2025 8:56 AM

చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్‌ మృతి

చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్‌ మృతి

మీర్‌పేట: కుటుంబ, ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్లకు చెందిన మనీష (28)కు కడ్తాల్‌ మండలం పల్లె చెల్కతండాకు చెందిన సుధాకర్‌తో 2017లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే భర్త, పిల్లలతో కలిసి ప్రశాంతిహిల్స్‌లో ఉంటున్న మనీష నాలుగేళ్లుగా మీర్‌పేట పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స నిమిత్తం డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కేర్‌ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్యం క్షీనించడంతో శనివారం మృతిచెందింది. తన కూతురి మృతిపై ఎలాంటి అనుమానం లేదని, ఆర్థిక ఇబ్బందులే కారణమని, మృతురాలి తండ్రి కాట్రావత్‌ కిష్ట ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌నాయక్‌ తెలిపారు.

బంగారం అపహరణలో కేసు నమోదు

నందిగామ: మండల పరిధిలోని మామిడిపల్లిలో జరిగిన భారీ దొంగతనం కేసులో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య ఇంట్లో రూ.15 లక్షల నగదు, 16 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన విషయం విధితమే. బాధితుడు కృష్ణయ్య గత నెల 27న ఇంట్లో దాచిన బంగారం, నగదు కనబడక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేశారు.

బైక్‌ దొంగకు రిమాండ్‌

శంకర్‌పల్లి: బైక్‌ దొంగతనం చేసిన వ్యక్తిని శనివారం శంకర్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కి తరలించారు. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బోరబండకి చెందిన పట్లోళ్ల రాజేశ్వర్‌రెడ్డి(42) సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు అలవాటు పడ్డాడు. కొన్నేళ్లుగా 20పైగా దొంగతనాలు చేస్తూ, జైలుకి సైతం వెళ్లి వచ్చాడు. అయితే గత నెల 26న శంకర్‌పల్లి పట్టణంలోని సమ్మయ్య అనే వ్యక్తి తన ఇంటి ముందు తాళం వేసి బైక్‌ని నిలపగా.. రాజేశ్వర్‌రెడ్డి దాన్ని చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా రాజేశ్వర్‌రెడ్డిని సనత్‌నగర్‌ వద్ద పట్టుకున్నారు. అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కి తరలించినట్లు సీఐ తెలిపారు.

డివైడర్‌ను ఢీకొని కూలీ దుర్మరణం

మహేశ్వరం: బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మహేశ్వరం గేటు సిరిగిరిపురం అర్బన్‌ ఫారెస్టు వద్ద చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగిరిపురం గ్రామానికి చెందిన తడకల బాలకృష్ణ(40) కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన శనివారం సాయంత్రం మహేశ్వరం గేటు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా అర్బన్‌ ఫారెస్టు వద్ద బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవ్వడంతో బాలకృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement