
బాత్‌రూంలో జారిపడి వలస కూలీ మృతి
మొయినాబాద్: బతుకు దెరువు కోసం వలస వచ్చిన ఓ కూలీ బాత్‌రూంలో జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన బంటి(27) అదే ప్రాంతానికి చెందిన పుష్పేందర్, గుజార్‌తో కలిసి మూడు నెలల క్రితం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌కు వలస వచ్చారు. గ్రామ సమీపంలోని పైప్‌లైన్ రోడ్డులో ఉన్న ఆవాసా విల్లాలో టైల్స్, మార్బుల్స్ పనిచేస్తూ అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. కాగా శుక్రవారం రాత్రి 8 గంటలకు భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంటి బాత్‌రూంకు వెళ్లి అందులో జారి పడ్డాడు. అతని తలకు గాయమైంది. అతనితో ఉన్నవారు నీళ్లు తాగించి పడుకోబెట్టారు. ఉదయం 6 గంటలకు బంటిని నిద్రలేపినా లేవలేదు. వెంటనే స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో చెరువులో పడి మేస్త్రీ..
కేశంపేట: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సంతాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాలాల రాకేష్(40) మేసీ్త్ర పనులు చేస్తూ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ఆయన గ్రామానికి చెందిన లేగలకాడి శ్రీనుతో కలిసి శివారులోని నాగుల చెరువులో చేపల వేటకు వెళ్లారు. రాకేష్ మద్యం మత్తులో ఉండటంతో చెరువులో పడిపోయాడు. ఆయన్ని రక్షించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా విఫలమయ్యాయి. అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రాంచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.