
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
చేవెళ్ల: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ డీఎంఈ డాక్టర్ నరేందర్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లుతో కలిసి చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని పరిశీలించారు. వార్డుల్లో ఉన్న రోగుల వద్దకు వెళ్లి వైద్యసేవలపై ఆరాతీశారు. అనంతరం ఆయన వైద్యులతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఓపీ, స్టాఫ్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆయనకు వివరించారు. సమస్యలపై రిపోర్టు పంపిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
వైద్యారోగ్యశాఖ డీఎంఈ డాక్టర్ నరేందర్‌కుమార్