
సమస్యల పరిష్కారానికి కృషి
శంకర్‌పల్లి: రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు అన్నారు. బుధవారం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకొని రావాలని, జీవో 317లో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్ బిల్లులు, డీఏల పెంపు, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయలుకు పే స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపా ధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు జంగయ్య, శ్రీను, బస్వరాజ్, శ్రీనివాస్, జంగయ్య పాల్గొన్నారు.
తపస్ జిల్లా అధ్యక్షుడు కాశీరావు