
నేడు గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
బడంగ్‌పేట్: నాదర్‌గుల్‌లో కొనసాగుతున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కాలేజీలో సంప్రదించాలని సూచించారు. టెన్త్ మెమో, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, నాలుగు పాస్ పోర్టుసైజు ఫొటోలతో రావాలని సూచించారు.
వన మహోత్సవంలో
మంత్రి కొండా సురేఖ
కందుకూరు: ఫ్యూచర్‌సిటీ పరిధిలోని గుమ్మడవెల్లి ఫారెస్ట్ భూముల్లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం సీడ్ బాల్స్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులతో కలిసి వన మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, స్థానిక నాయకులు ఉన్నారు.
మైనార్టీ యువతకు
ఉచిత కోచింగ్
కందుకూరు: మైనార్టీస్ స్టడీ సర్కిల్, కౌన్సెలింగ్ సెంటర్ హైదరాబాద్ తరఫున చదువుకున్న మైనార్టీ (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పార్సీ, జైన, బౌద్ధ) యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.నవీన్‌కుమార్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1,2,3,4 ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 21లోపు కలెక్టరేట్‌లోని మైనార్టీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని తెలిపారు.
మహిళా సంఘాలకు
బ్యాంకు లింకేజీ రుణాలు
బడంగ్‌పేట్: పొదుపు సంఘాలకు అండగా ఉంటామని మున్సిపల్ కమిషనర్ పి.సరస్వతి అన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో బుధవారం మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. బ్యాంక్ లింకేజీ కింద మంజూరైన రూ.2 కోట్ల రుణాలను అందజేశారు. అనంతరం గాంధీనగర్ చౌరస్తాలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ కృపాకర్, ఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, టీపీఓ కిరణ్, డీఈఈ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులందరికీ
ప్లాట్లు ఇవ్వండి
మొయినాబాద్: అర్హులైన రైతులందరికీ ప్లాట్లు కేటాయించాలని ఎనికేపల్లి గోశాల భూ బాధితులు కోరారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎనికేపల్లి సర్వేనంబర్ 180లో గోశాలకు కేటాయించిన 99.14 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న రైతులకు పరిహారంగా ఒక్కొక్కరికి 300 గజాల స్థలం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సమగ్ర విచారణ జరిపించి, అర్హులైనవారందరికీ ప్లాట్లు ఇవ్వాలని కోరారు. దీనిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, రైతులు మహిపాల్, రాము, శ్రీనివాస్, సికిందర్ తదితరులు ఉన్నారు.

నేడు గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు

నేడు గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు