
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కుల్కచర్ల: కుటుంబ ఉన్నతికి గృహ నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వెళ్లిన వ్యక్తి విగతజీవిగా మారాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరా లు.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బోయిన ప్రభాకర్(35) గృహనిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఓ భవన నిర్మాణంలో పనిచేస్తుండగా విద్యుత్‌వైర్లు తగడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సంతోష, కూతురు సహస్ర(7), కుమారుడు రిత్విక్(5) ఉన్నారు.
రిజ్వాన్‌కు గోల్డ్ మెడల్
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ వేదికగా జరుగుతున్న ఐదో టిస్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మూడో రోజు పోటీల్లో యు వ సెయిలర్ మహ్మద్ రిజ్వాన్ సత్తా చాటాడు. ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ బాలుర విభాగంలో రిజ్వాన్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. రిజ్వాన్ ఈ కేటగిరీలో మరో రేస్ మిగిలుండగానే అగ్రస్థానం సాధించాడు. ఇదే కేటగిరీ బాలికల విభా గంలో తెలంగాణ సెయిలింగ్ అకాడమీకి చెందిన షేక్ రమీజ్ భాను, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన శ్రింగేరి రాయ్‌పై ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచి ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఐఎల్‌సీఏ 4 కేటగిరీ బాలుర విభాగంలో నేవీ యాచ్ సెయిలింగ్ క్లబ్ కు చెందిన రమాకాంత్ ఆరు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇదే కేటగిరీ లో బాలికల విభాగంలో ఆస్థా పాండే అగ్రస్థానంలో నిలిచింది. 420 మి క్సిడ్ కేటగిరీలో తెలంగాణ సెయిలింగ్ అకాడమీకి చెందిన తనూజా కా మేశ్వర్, శ్రవణ్ కత్రావత్ 10 పా యింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.