
మోడల్ స్కూల్‌లో పీఎంశ్రీ సంబరాలు
కందుకూరు: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ– 2020 ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని మోడల్ స్కూల్ పీఎంశ్రీ విభాగంలో ఉత్తమ పాఠశాలగా ఎంపికై ంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రిన్సిపాల్ విష్ణుప్రియ ఆధ్వర్యంలో స్కూల్‌లో సంబరాలు నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించిన వేడుకలను స్క్రీన్ ద్వారా విద్యార్థులకు చూపించారు. అనంతరం ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పీఎంశ్రీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించడంలో మోడల్ స్కూళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఉత్తమ ఫలితాను అందిస్తున్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. అనంతరం పక్కనే ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్స్ ఏడీ శ్రీనివాసాచార్యులు, డీడీ దుర్గాప్రసాద్, జిల్లా ఏఎంఓ జయచంద్ర, ఎంఈఓ నర్సింహ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శివలీల, ఎస్‌ఎల్‌టీఏ జిల్లా అధ్యక్షుడు ఎండీ బషీర్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసశర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.