‘అందాల’ డ్రెస్ డిజైనర్ మన స్వాతి..
అనంతగిరి: ప్రపంచ అందాల పోటీల్లో భాగంగా గురువారం భూదాన్ పోచంపల్లిలో తళుక్కుమన్న ముద్దుగుమ్మలకు డ్రెస్‌లు డిజైన్ చేసింది ఎవరో కాదు వికారాబాద్ జిల్లాకు చెందిన మఠం వైద్యనాథ్ కూతురు ఎం.స్వాతి. ఈమె ఆరేళ్లుగా హైదరాబాద్‌లో మైరీతి, తరం పేరిట డ్రెస్ డిజైనింగ్ చేస్తోంది. విదేశీ వనితలు, నటీమణులు, ఉన్నత స్థాయిలో ఉన్న వారికి వివిధ ఆకృతుల్లో అందమైన డ్రెస్‌లు డిజైన్ చేసి ఇస్తోంది. ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న 40 మంది అందెగత్తెలకు వారు కోరిన విధంగా డ్రెస్‌లను రూపొందించింది. పోచంపల్లి, నారాయణపేట చేనేత వస్త్రాన్ని వాడి దుస్తులు తయారు చేయడం వీరి ప్రత్యేకత. గురువారం జరిగిన కార్యక్రమంలో అందాల భామలు స్వాతి డిజైన్ చేసిన డ్రెస్‌లు ధరించి అలరించారు. దుస్తుల తయారీకి నెల రోజులు కష్టపడినట్లు తెలిసింది. స్వాతితోపాటు మైరీతి, తరం మరో వ్యవస్థాపకులు, మితుల్ నిర్వాహకులు ఎం.మహేంద్ర, ఎం.మానస, వారి డిజైనర్స్ మౌనిక, రమ్య ఇతర సిబ్బంది ఎంతో కష్టపడ్డారు.
‘అందాల’ డ్రెస్ డిజైనర్ మన స్వాతి..


