వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
నేడు చిలుకూరుకు తరలిరానున్న భక్తజనం
మొయినాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం చిలుకూరు బాలాజీ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. వైకుంఠ ద్వారం లేకున్నా ఏటా ఇక్కడికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని విశ్వాసం. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను గుర్తించి ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు చేశాం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలాలను సిద్ధం చేశాం. స్వామి వారి దర్శనానికి క్యూలైన్లు ద్వారా పంపేందుకు ఏర్పాట్లు చేశాం. ఆలయానికి వచ్చే వారు సంయమనంతో ఉండాలి.
– రంగరాజన్, ఆలయ అర్చకుడు


