ఫ్యూచర్‌కు బాటలు | - | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌కు బాటలు

Dec 30 2025 11:28 AM | Updated on Dec 30 2025 11:28 AM

ఫ్యూచర్‌కు బాటలు

ఫ్యూచర్‌కు బాటలు

● పరిపానలలో జిల్లాపై చెరగని ముద్ర ● ఫోర్త్‌సిటీ పేరుతో కొత్త నగరం ఆవిష్కృతం ● గ్లోబల్‌ సమ్మిట్‌తో మరింత పెరిగిన కీర్తి

జిల్లా పరిపాలనా రంగంపై ఈ ఏడాది చెరగని ముద్ర వేసింది. అద్భుత నగరికి, అనేక ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. గ్లోబల్‌ సమ్మిట్‌తో ప్రపంచపటంపై జిల్లా పేరును శాశ్వతంగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. తలసరిలో టాప్‌లో నిలిచింది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌కు దీటుగా మరో అద్భుత నగరానికి ఆమోదం లభించింది. పాతనగరంపై ఒత్తిడి త గ్గించేందుకు, పెరుగుతు న్న జనాభాకు అనుగుణంగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీ పేరుతో మరో నగరానికి అంకురార్పణ జరిగింది. జిల్లాలోని ఏడు మండలాలు.. 56 పంచాయతీలు.. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..30 వేల ఎకరాల్లో కాలు ష్య రహిత నగరానికి ఆమోదం లభించింది. ఓఆర్‌ఆర్‌కు అటు ఇటుగా ఉన్న 30 పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేసింది. సీనియర్‌ ఐఏఎస్‌ను కమిషనర్‌గా నియమించడంతో పాటు 90 పోస్టులను సృష్టించింది. మీర్‌ఖాన్‌పేట వేదికగా యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ, ఎఫ్‌సీడీఏ భవనాలకు శంకుస్థానపన జరిగింది.

గ్రీన్‌ఫీల్డ్‌రోడ్లు, మెట్రో విస్తరణ

ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు, అటు నుంచి ఆమనగల్లు వరకు 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తొలిదశలో 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు, రెండో దశలో 22.30 కిలోమీటర్లకు రూ.2,365 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 4,725 మంది రైతుల నుంచి 1,004.22 ఎకరాల భూమిని సేకరించింది. నాగోలు నుంచి ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ వెంట 40 కిలోమీటర్ల దూరం మెట్రోను ప్రతిపాదించింది. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు విస్తరించాలని నిర్ణయించింది.

తలసరిలోనూ చరిత్రే..

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా రియాల్టీ రంగంలో కొంత స్తబ్ధత ఏర్పడినప్పటికీ జిల్లాలో భూముల ధరలు మా త్రం ఆకాశాన్ని తాకాయి. కోకాపేట్‌ నియోపోలీస్‌ వెంచర్‌లో ఎకరం ఏకంగా రూ.151.25 కోట్లు పలికి చరిత్ర సృష్టించింది.సబ్‌ రిజిస్ట్రా ర్‌ ఆఫీసు ల్లో నెల కు సగటు న 22 వేల డాక్యు మెంట్లు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య కొంత తగ్గినట్లు కన్పించినా ప్రభుత్వానికి ఆదాయం మాత్రం గణనీయంగా చేకూరింది. ఐటీ, రియల్‌ ఎస్టేట్‌, పారిశ్రామిక ప్రగతి కారణంగా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా సగటు తలసరి ఆదాయం రూ.11.46 లక్షలుగా తేలింది. ఆదాయంలోనే కాదు కరెంట్‌, లిక్కర్‌ వినియోగంలోనూ మొదటి స్థానమే.

‘గిన్నిస్‌’లోకి మహాబతుకమ్మ

దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్‌ 29న సరూర్‌నగర్‌ స్టేడియం వేదికగా ప్రభుత్వ సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాబతుకమ్మ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించుకుంది. 300 మంది మహిళలు, మూడు రోజులు శ్రమించి, 36 అడుగుల వెడల్పు, 63.11 అడుగుల ఎత్తు, 10.7 టన్ను ల బరువుతో 11 వరుసల్లో తయారు చేసిన మహా బతుకమ్మ చుట్టూ 1,500 మంది మహిళలు బతుకమ్మ ఆడి చరిత్ర సృష్టించారు.

‘గ్లోబల్‌’ సంబురం

విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం డిసెంబర్‌ 8,9 తేదీల్లో మీర్‌ఖాన్‌పేట వేదికగా వంద ఎకరాల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాటు చేసింది. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజ కంపెనీల ప్రతినిధులను రప్పించింది. సీఎం సహా మంత్రులు, ప్రభుత్వ అధికార వర్గాలన్నీ రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేశాయి. 27 అంశాలపై చర్చాగోష్టిలు నిర్వహించి, 2047 నాటికి తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నామో వివరించారు. ఫ్యూచర్‌సిటీ వేదిక గా రెండు రోజుల్లో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుల కు పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సమ్మిట్‌ ముగింపు వేడుక ల్లో భాగంగా ఫ్యూచర్‌సిగలో మూడు వేలకుపైగా డ్రోన్‌ పుష్పాలు వికసించాయి. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో ఈ డ్రోన్‌ ప్రదర్శన చోటు సంపాదించుకుంది.

మున్సిపాలిటీల్లో మార్పులు చేర్పులు

స్థానిక సంస్థల్లో పలు సంస్కరణలు, మార్పు లు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఏడాదంతా ప్రత్యేక అధికారుల పాలనలోనే మగ్గాయి. ఫలితంగా 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇదే సమయంలో ఓఆర్‌ఆర్‌కు అటు ఇటుగా ఉన్న 30 పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. తర్వా త మూడు కార్పొరేషన్లు సహా 8 మున్సిపాలిటీల విలీనం జరిగింది. అప్పటి వరకు ఒక్కో మున్సిపాలిటీలో సగటున 25 డివిజన్లు/వార్డులు ఉండగా, ఆ మేరకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు ఉండేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక్కో కార్పొరేషన్‌ మూడు డివిజన్లకు, మున్సిపాలిటీ ఒకటి, రెండు డివిజన్లకే పరిమితమైంది. చేవెళ్ల, మొయినాబాద్‌ జీపీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేసింది.

రెండేళ్లుగా ప్ర త్యేకాధికారుల పాలనలో మగ్గి న పంచాయతీలకు ఎన్నికల కమిషన్‌ ఇటీవలే ఎన్నికలు నిర్వహించింది. జిల్లాలోని 526 జీపీలు ఉండగా, వీటిలో మాడ్గుల మండలంలోని ఒక జీపీ మినహా మిగిలిన వాటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది. ఆయా పాలక మండళ్లు ఇటీవలే కొలువుదీరాయి.

కొలువుదీరిన కొత్తపాలక మండళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement