కొత్త మండలాలు చేయండి
షాద్‌నగర్: నియోజకవర్గంలోని చేగూరు, చించోడ్, మొగిలిగిద్ద గ్రామాలను ప్రభు త్వం మండలాలుగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం శాసన మండలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. చిన్న మండలాలతోనే గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతులు సాధ్య మని అన్నారు. ప్రజాభిప్రా యం మేరకు నందిగామ మండలం చేగూరు, ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్, మొగిలిగిద్ద గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల మొగిలిగిద్ద గ్రామానికి సీఎం రేవంత్‌రెడ్డి విచ్చేసి గ్రామాభివృద్ధికి రూ.60కోట్లు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాదిన్నర అవుతున్నా వాటి పనులు కూడా ప్రారంభం కాలేదన్నారు. వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.


