ఇంట్లో పేలిన సిలిండర్
పహాడీషరీఫ్: స్టోర్ రూంలో ఉంచిన సిలిండర్ పేలిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రకుంట సాదత్‌నగర్‌కు చెందిన సల్మా భాను కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. బుక్ చేసిన గ్యాస్ రావడంతో ఇంటి బాల్కానీలో ఉన్న విజిటింగ్ రూమ్‌లో ఉంచారు. ఆ సమయంలో పిల్లలు పాఠశాలకు వెళ్లడంతో సల్మా లోపలి ఇంట్లో ఉంది. అప్పటికే లీకవుతున్న గ్యాస్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఇంట్లో ఉన్న సామగ్రి కాలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేని కారణంగా పెను ప్రమాదమే తప్పింది. ఇంటి పైకప్పు కూడా స్వల్పంగా ధ్వంసమయింది.
తప్పిన పెను ప్రమాదం


