భూ వివాదం.. ఉద్రిక్తం | - | Sakshi
Sakshi News home page

భూ వివాదం.. ఉద్రిక్తం

Apr 10 2025 7:14 AM | Updated on Apr 10 2025 7:14 AM

భూ వి

భూ వివాదం.. ఉద్రిక్తం

వంద మంది జేసీబీతో వచ్చి..

సుమారు వంద మంది బుధవారం తెల్లవారుజామున జేసీబీతో వచ్చి ప్లాట్ల కడీలను ధ్వంసం చేయడంతో పాటు, ప్రీకాస్ట్‌ నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద వెళ్తుండగా ప్లాట్లు, ఇళ్ల యజమానులు అక్కడికి చేరుకున్నారు. ఆపాలని ప్రాధేయపడుతున్నా వినకుండా కబ్జాకు వచ్చిన వారి అనుచరులు ఒక్కసారిగా రాళ్లదాడి మొదలు పెట్టారు. దీంతో ప్లాట్లు, ఇళ్ల యజమానులు ఒకరికి ఒకరు సమాచారం చేరవేయడంతో అక్కడికి పదుల సంఖ్యలో చేరుకున్నారు. వీరికి పక్క కాలనీల వాసులు కూడా తోడవ్వడంతో ప్లాట్లను ధ్వంసం చేస్తున్న వారిని తరిమారు. ఈ క్రమంలో జేసీబీ, ఆటో, పలు బైక్‌లను ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ బైక్‌కు నిప్పు పెట్టారు. అదే సమయంలో మెహిదీపట్నం నుంచి కూలీ పని ఉందని చెప్పి ఓ బస్సులో మహిళలను తీసుకురావడంతో వారిని సైతం తరిమికొట్టారు. అదే సమయంలో ఆ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో కొందరు ప్లాట్ల యజమానులకు, కూలీకి వచ్చిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.

తుర్కయంజాల్‌: తుర్కయంజాల్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 240, 241, 242లోని నెలకొన్న భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం తెల్లవారుజామున కబ్జాదారులు ప్లాట్ల కడీలు, ప్రీకాస్ట్‌లను తొలగించడంతో పాటు, నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని కూల్చడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కొక్కరుగా చేరుకున్న ప్లాట్లు, ఇళ్ల యజమానులు, పక్క కాలనీవాసులు తిరగబడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

వివరాలు ఇవీ..

గుండ రాజమ్మ అనే మహిళ తన వారసత్వ వాటాగా రావాల్సిన ఆస్తి ఇవ్వలేదని 1984లో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమెకు సెప్టెంబర్‌ 2024లో అడ్వకేట్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా తుర్కయంజాల్‌ రెవెన్యూ సర్వే నంబర్‌ 240లోని 10.09 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయిస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. దీని ఆధారంగా భూమిని ఆళ్ల రామకృష్ణ, సలాం, రిజ్వాన్‌ అనే ముగ్గురు వ్యక్తులకు ఆమె జీపీఏ చేసింది. వాళ్లు 2025 మార్చి నెల 26న ఇదే సర్వే నంబర్‌లోని వ్యవసాయ పొలానికి కంచె వేసే ప్రయత్నం చేయడంతో పాటు, పలు ఇళ్లు, ప్రీకాస్ట్‌ నిర్మాణాలను కూల్చి వేయించారు. దీంతో ఇక్కడ భూ వివాదం రాజుకుంది. ప్లాట్లు, ఇళ్ల యజమానులతో పాటు, పొలానికి చెందిన రైతులు కూడా కోర్టులను ఆశ్రయించారు. ఇటీవల 1.10 గుంటల పొలానికి ఇంజక్షన్‌ ఆర్డర్‌ వచ్చింది. అప్పటి నుంచి భూమిని కబ్జాలోకి తీసుకోవాలని భావిస్తున్న వారి అనుచరులు కాలనీలో నివసించే వారిని భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు.

ఆలస్యంగా పోలీసుల రాక

ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్న పోలీసులు సుమారు గంటన్నర తరువాత సంఘటనా స్థలానికి చేరుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్లాట్ల యజమానులు 100కు డయల్‌ చేయడంతో ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అప్పటికే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏసీపీ కాశిరెడ్డి, ఎస్‌ఓటీ ఏసీపీ షాకీర్‌ హుస్సేన్‌, సీఐ శ్రీనివాస్‌లు పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు ఇరువర్గాల మీద కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

తేనేటీగలు లేవడంతో

ఈ విషయాన్ని ఎమ్మెల్యే రంగారెడ్డి దృష్టికి తీసుకునేందుకు ప్లాట్లు, ఇళ్ల యజమానులు తొర్రూర్‌లోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ వీరికి జీఏపీ చేసుకున్న ఆళ్ల రామకృష్ణ తారసపడ్డాడు. దీంతో మాటామాటా పెరిగింది. ఒక్కసారిగా ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడ చెట్టుకున్న తేనే తెట్టును రాయితో కొట్టడంతో ఒక్కసారిగా తేనెటీగలు లేచాయి. దీంతో ఎమ్మెల్యేతో సహా అంతా అక్కడి నుంచి పరుగులు తీశారు.

అనుచరులతో వచ్చి ప్లాట్లు,

ప్రీకాస్ట్‌లను ధ్వంసం చేసిన వ్యక్తులు

తిరగబడిన బాధితులు

పలు వాహనాలు ధ్వంసం

భూ వివాదం.. ఉద్రిక్తం1
1/1

భూ వివాదం.. ఉద్రిక్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement