ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం
మొయినాబాద్: సోడెక్స్– హో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ ఏటా ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎంఎస్‌కే ఇంటర్నేషనల్ గ్రౌండ్‌లో నిర్వాహకులు సంజయ్‌గుప్తా, ఆనంద్‌కుమార్, రమేశ్, చిరంజీవి, రాంకీ, బి.శ్రీధర్ తదితరులు పోటీలను ప్రారంభించారు. ఆరు రోజులపాటు జరిగే పోటీల్లో 24 ఇంటర్నేషనల్ జట్లు పాల్గొననున్నాయని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి.. ఉత్తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు.


