ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీలో ఆస్తిపన్నులు, నల్లా బిల్లులు వసూళ్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎలాగైనా నూటికి నూరు శాతం వసూలు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. మున్సిపాలిటీలో 6,085 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ ఏడాది రూ.4.42 కోట్లు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.3.19 (72.19 శాతం) కోట్లు వసూలు చేశారు. మరో రూ.1.23 కోట్లు పెండింగ్ ఉంది. బిల్‌కలెక్టర్లు, వార్డు అధికారులు కలిసి దశల వారీగా వసూలు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న వాటికి రాయితీలు ఇచ్చి పన్నులు చెల్లించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. వారం రోజుల్లో వంద శాతం లక్ష్యం చేరుకునే విధంగా కృషి చేస్తామని చెబుతున్నారు.


