ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో వెలసిన శివ సీతారామాంజనేయస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకం, హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్, స్థానిక నాయకులు నరోత్తమ్‌రెడ్డి, బాలకుమార్‌గౌడ్, నర్సింహారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, పర్వతాలు, గిరి, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.