ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకం, పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు గోపాలాచార్యులు, రామాచార్యులు, రామానుజాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజ్‌కుమార్, ఈఓ స్నేహలత, మాజీ సర్పంచ్ శ్రీశైలం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.