గురుకులం.. | - | Sakshi
Sakshi News home page

గురుకులం..

Mar 13 2025 4:23 PM | Updated on Mar 13 2025 4:23 PM

గురుక

గురుకులం..

గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
ఏకీకృత గురుకులాలకు నిధుల మంజూరు
నవ్యాక్షర పథం

8లోu

ఒక్కోటి 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం

అక్కడే వసతి గృహాల సముదాయాలు

జిల్లాలో షాద్‌నగర్‌, చేవెళ్ల, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఏర్పాటు

షాద్‌నగర్‌: కులం లేదు.. మతం లేదు.. బీద, ధనిక భేదం లేదు.. చదువులమ్మ చెట్టు నీడలో అందరూ ఒకేచోట అక్షరాలు దిద్దొచ్చు.. సర్కారు అందించే సాయంతో బంగారు భవితకు బాటలు వేసుకోవచ్చు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమీకృత ఏకీకృత పాఠశాలలతో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో అక్షర కేంద్రాలకు శ్రీకారం చుడుతోంది. జిల్లాలో షాద్‌నగర్‌, చేవెళ్ల, కల్వకుర్తి, ఇబ్రహీపట్నం నియోజకవర్గాలకు మంజూరు చేసింది.

ఆరంభం ఇలా..

గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా.. నిరుపేదలకు అక్షరాన్ని అందుబాటులోకి తేచ్చేలా ప్రభుత్వం ఏకీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి అంకురార్పణ చేస్తోంది. షాద్‌నగర్‌ నియోజకవర్గం కొందుర్గులో గత ఏడాది అక్టోబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఈ పాఠశాలలను అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని, గ్రామీణ నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందించేలా ఈ బడులను తీర్చిదిద్దుతామని సీఎం బహిరంగ సభలో ప్రకటించారు.

ఇదీ ప్రయోజనం..

ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చదువుతో పాటు ఆసక్తి కలిగిన రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా కులాలు, మతాల వారీగా పాఠశాలలు, వసతి గృహాలు ఉన్న నేపథ్యంలో అందరినీ ఒకే గొడుగు కిందకు తేనున్నారు. కార్పొరేట్‌ స్థాయిలో ఈ గురుకులాల్లో కంప్యూటర్లు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల ఆసక్తి మేరకు ఆయా రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులను అందుబాటులో ఉంచనున్నారు.

ఇంటిగ్రేటెడ్‌లో ఇవీ ప్రత్యేకతలు..

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను ప్రతి నియోజకవర్గంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి పాఠశాలను సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. విద్యార్థులకు తరగతి గదులే కాకుండా అంతర్జాతీయ స్కూళ్లతో సమానంగా క్యాంపస్‌లను అధునాతనంగా నిర్మించనున్నారు. విద్యార్థులకు ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధించనున్నారు. అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందించనున్నారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు ఐదు వందల మంది ఉపాధ్యాయులు బోధన చేయనున్నారు. పాఠశాల భవనాన్ని అంతర్జాతీయ పాఠశాలలతో సమానంగా నిర్మించనున్నారు. సౌర, వాయు విద్యుత్‌ను వినియోగించేలా, వాన నీటిని సంరక్షించేలా డిజైన్‌ చేశారు. విద్యార్థులకు క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, టెన్నిస్‌ కోర్టులు, ఔట్‌ డోర్‌ జిమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

హర్షనీయం

ఏకీకృత గురుకుల పాఠశాలను మంజూరు చేయడం హర్షనీయం. ఉన్నత విద్య కోసం పిల్లలను దూర ప్రాంతాలకు పంపించాల్సిన అవసరం తగ్గుతుంది. అత్యాధునిక వసతులతో నిర్మించే గురుకులాలు పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది.

– సుజాత, విశ్వనాథ్‌పూర్‌, కొందుర్గు మండలం

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రపంచంతో పోటీ పడే విధంగా పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందించడం కోసం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దనుంది.

– వీర్లపల్లి శంకర్‌, ఎమ్మెల్యే, షాద్‌నగర్‌

గురుకులం..1
1/3

గురుకులం..

గురుకులం..2
2/3

గురుకులం..

గురుకులం..3
3/3

గురుకులం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement