
ఇబ్రహీంపట్నం: సుమారు రూ.59కోట్లకు పైగా విలువచేసే ఆస్తులున్నాయని, వివిధ పోలీస్‌స్టేషన్లలో తొమ్మిది కేసులున్నట్లు ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. చేతిలో రూ.5లక్షల నగదు, ఆరు బ్యాంకు ఖాతాల్లో రూ.3,76,50,595, 2015 మోడల్ ఆడి కారు (ప్రస్తుతం రూ.15లక్షల విలువ), 2014 మోడల్ మహేంద్ర బొలేరో(ప్రస్తుత విలువ రూ.లక్ష) 8తులాల బంగారం, 10కిలోల వెండి ఉన్నట్లు వెల్లడించారు.
స్థిరాస్తులు
తొర్రూర్‌లో రూ.1.60కోట్ల విలువైన 35 గుంటల భూమి, బొంగుళూర్‌లో రూ.3కోట్ల విలువ చేసే 2.32 ఎకరాల భూమి, కోహెడాలో రూ.19.30కోట్ల విలువ చేసే 20.20 ఎకరాల భూమి ఉన్నట్లు చూపారు.
నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్
మన్సూరాబాద్‌లో రూ.90 లక్షల విలువ చేసే 418 చదరపు గజాల స్థలం, కుంట్లూర్‌లో రూ.1.60కోట్ల విలువ చేసే రెండు ప్లాట్లు, హయత్‌నగర్ మండలం బహుదూర్‌గూడలో రూ.3,86,93,610 విలువచేసే 1029 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న భవనం, రాయదుర్గంలో కుమారుడు అభిషేక్‌రెడ్డితో కలిపి 1000 చదరపు అడుగులు స్థలం, (మల్‌రెడ్డి భాగం ప్రస్తుత విలువ రూ.65లక్షలు), రాయదుర్గంలో రూ.3.50లక్షల విలువ చేసే 161 చదరపు గజాల్లో భవనం, గచ్చిబౌలిలోని రూ.7.50కోట్ల విలువైన మీనాక్షి టెక్ పార్కులో 207 చదరపు గజాల్లో భవనం, సరూర్‌నగర్ మండలం ద్వారకపురంలో అపార్టుమెంట్‌లోని ప్లాట్ల షేర్ల విలువ రూ.7.50 కోట్లు, సంఘీ లెదర్స్ లిమిటెడ్‌లో షేర్స్ రూపంలో రూ.2.50 లక్షలు, మహాలక్ష్మీ థియేటర్‌లో 20శాతం షేర్ ఉన్నట్లు అఫడవిట్ పేర్కొన్నారు.
నివాస గృహాలు
చైతన్యపురి ప్రభాస్‌నగర్‌లో రూ.1.44 కోట్ల విలువైన 500 చదరపు గజాల్లో ఇల్లు, మాదాపూర్‌లోని ఎస్‌ఎంఆర్ వినయ్ అపార్టుమెంట్‌లో రూ.కోటి విలువచేసే 1500 చదరపు అడుగుల ఫ్లాట్లున్నాయి. మొత్తం మల్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.59,75,93,610 కాగా అందులో రూ.1.60కోట్లు వారసత్వ ఆస్తిగా పేర్కొన్నారు.
అప్పులు
ఎస్‌బీఐ సైఫాబాద్ బ్రాంచ్‌లో తనయుడు అభిషేక్‌రెడ్డితో కలిపి తీసుకున్న రూ.6కోట్ల అప్పుల్లో మల్‌రెడ్డి భాగానికి రూ.3కోట్లు, అదే బ్యాంకులో మల్‌రెడ్డి మరో రూ.19,40,376 అప్పు చెల్లించాల్సివుందన్నారు.
సతీమణి అనసూయ పేరిట
అనసూయ చేతిలో రూ.3లక్షల నగదు, నాలుగు బ్యాంకు అకౌంట్లల్లో రూ.15,51,088 ఉన్నాయి. కిలో బంగారం, 5 కిలోల వెండి, రూ.28,867 సాలీనా చెల్లించే ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లు చూపారు.
వ్యవసాయ భూములు
కోహెడాలో రూ.9కోట్ల విలువ చేసే 11.2ఎకరాలు, బొంగుళూర్‌లో రూ.2.40 కోట్ల విలువైన 2.4 ఎకరాల భూమి ఉంది.
నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్
మక్తా మహబూబ్‌పేట్, శేరిలింగంపల్లిలో రూ.65 లక్షల విలువైన 998 చదరపు గజాల ఫ్లాటు, కమర్షియల్ భవనాలు హయత్‌నగర్ మండలం బహుదూర్‌గూడలో 3,86,93,610 విలువచేసే 1029 చదరపు గజాల్లో నిర్మాణంలో ఉన్న భవనం, సరూర్‌నగర్ మండలం ద్వారకపురంలో అపార్టుమెంట్ రూ.3 కోట్ల విలువచేసే 4.5శాతం షేర్లు ఉన్నాయి.
తిరుమల హిల్స్‌లో రూ.5కోట్ల విలువైన ఇల్లు
తొర్రూర్‌లో రూ.36 లక్షల విలువైన వెయ్యి గజాల స్థలంలో ఇల్లు, తిరుమల హిల్స్ రూ.5 కోట్ల విలువ చేసే 1012 గజాల్లో ఇల్లు, రూ.12లక్షల విలువచేసే 2017 మోడల్ ఇన్నోవాతో కలిసి మల్‌రెడ్డి రంగారెడ్డి భార్య అనసూయ ఆస్తుల విలువ రూ.18,97,93,610 ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఎస్‌బీఐ సైఫాబాద్ బ్రాంచ్‌లో రూ.4,46,897 అప్పలున్నట్లు తెలిపారు.
రూ.1.69కోట్ల వారసత్వ ఆస్తి
రూ.22.40 కోట్ల అప్పులు
ఎలక్షన్ అఫిడవిట్‌లో పేర్కొన్న కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం అభ్యర్థి రంగారెడ్డి