బాలిక కిడ్నాప్‌.. అత్యాచార యత్నం | - | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్‌.. అత్యాచార యత్నం

Jul 6 2023 9:10 AM | Updated on Jul 6 2023 9:59 AM

- - Sakshi

కిడ్నాపర్ల నుంచి బాలికను రక్షించి పోలీసులకు అప్పగించిన హిజ్రా

హయత్‌నగర్‌: హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఓ బాలికను అపహరించి లైంగిక దాడి యత్నం చేయగా.. దుండగులను ప్రతిఘటించి తప్పించుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎల్‌బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ కథనం ప్రకారం... పెద్దఅంబర్‌పేట్‌లో నివసించే ఓ బాలిక(17) పదో తరగతి వరకు చదివి ఇంటివద్దనే ఉంటోంది. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఓ గుర్తు తెలియని యవకుడు బైకుపై వచ్చి బాత్రూంకు వెళుతున్న బాలికను పిలిచి అడ్రస్‌ తెలపమని ఫోన్‌ చూపించాడు. ఆమె ఫోన్‌ చూస్తుండగానే ఆ అడ్రస్‌కు తీసుకెళ్లమని కోరి బైకుపై ఎక్కించుకుని వెళ్లాడు.

మధ్యలో మరో యువకుడు బైకుపై ఎక్కాడు. వారిద్దరు బాలికను బైకుపై ఔటర్‌ రింగురోడ్డు సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఓ చిన్నరూంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి ప్రయ త్నించారు. భయాందోళనకు గురైన బాలిక ప్రతిఘటించి వారి నుంచి తప్పించుకుని జాతీయ రహదారిపైకి చేరింది. రోడ్డుపై తచ్చాడుతున్న బాలికను గమనించిన ఓ హిజ్రా ఆమెను ప్ర శ్నించగా.. తన తల్లికి ఫోన్‌ చేయమని కోరింది. తల్లి స్పందించక పోవడంతో పక్కనే ఉన్న హోటల్‌ వద్దకు వెళ్లి వారి సహాయంతో పోలీ సులకు సమాచారం అందించారు.

వెంట నే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరిన బాలికను చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలిక తప్పించుకుని చెట్ల పొదల నుంచి రావడం వల్ల చిన్న చిన్న గాయాలయ్యాయని, ఆమెకు వైద్య పరీక్షలు చేయించామని లైంగికదాడి జరగలేదని డీసీపీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాగా దుండగులు బాలికపై మత్తుమందు స్ప్రే చేశారని అనుమానిస్తున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement