సత్యాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న చల్లా నర్సింహారెడ్డి
బడంగ్‌పేట్: కుట్ర పూరితంగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారని డీసీసీ అధ్యక్షుడు చల్లా న ర్సింహారెడ్డి ఆరోపించారు. బడంగ్‌పేట చౌరస్తాలో మంగళవారం సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజలను ఏకతాటిపైకి తెస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు ఇలాంటి నీచమైన కుట్రలకు తెగించారని ధ్వజమెత్తారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత, పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ సంపదనంతా అదానీకి దోచి పెడుతూ.. దేశాన్ని ఆర్థికమాంద్యం వైపు నడిపిస్తున్న సత్యాన్ని దేశ ప్రజలకు ఎక్కడ రాహుల్ చెబుతాడోనని భయం వేసి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి బంగారు బాబు, పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు పందుల వెంకటేశ్, మీర్‌పేట్ అధ్యక్షుడు సామిడి గోపాల్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి


