ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

సిరిసిల్ల: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోలీస్‌శాఖ పనిచేస్తోందని ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేకు 31 మంది బాధితులు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఫిర్యాదులపై ఆయా ఠాణాల ఎస్‌హెచ్‌వోలతో మాట్లాడారు.

సమర్థులుగా ఎదగాలి

సమర్థవంతమైన పోలీసింగ్‌ విధానాలతో సమర్థులైన అధికారులుగా ఎదగాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే సూచించారు. 24 వారాలపాటు ప్రాక్టికల్‌ శిక్షణకు వచ్చిన ట్రైనీ డీఎస్పీలు పి.రవికుమార్‌, బి.సందీప్‌ నాయక్‌ ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌శాఖలో విధులు, బాధ్యతలు, పోలీసింగ్‌ విధానాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement