సిరిసిల్ల: ఖేలో ఇండియా పోటీల్లో ప్రతిభ చూపాల ని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆకాంక్షించారు. సిరిసిల్ల మినీస్టేడియంలో నిర్వహిస్తున్న వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సోమవారం పరిశీలించారు. అనంతరం ఆర్చరీ క్రీడాకారుల ఆటతీరు పరిశీలించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 48 మంది వాలీబాల్ క్రీడాకారులు శిక్షణ తీసుకుంటున్నారు.
విద్యార్థినిలకు అభినందనలు
రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ అభినందించారు. వారధి ఫౌండేషన్ నిర్వహించిన డిబేట్ కాంపిటీషన్లో జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ముత్తు కావ్య, గాజుల లౌక్య, కొండ కావ్య ప్రథమ స్థానంలో నిలిచారు.


