వణుకుతున్న ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

వణుకుతున్న ఆరోగ్యం

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న జ్వరబాధితులు

చిన్నారులు, వృద్ధులే ఎక్కువ

భారీగా ఔట్‌ పేషెంట్లు

ఈ అబ్బాయి జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నల్ల అశ్వత్‌(6). నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించారు. చికిత్స చేస్తున్నట్లు బాలుడి నానమ్మ నల్ల లక్ష్మి తెలిపారు.

బెడ్‌పై పడుకున్న బాలిక కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెకు చెందిన మెరీనా ప్రిస్కిల్లా(6). ఆరు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. తెల్ల రక్తకణాలు తగ్గినట్లు వైద్యులు తెలిపారని తల్లి మరీయా ఆవేదన వ్యక్తం చేశారు.

సిరిసిల్లటౌన్‌: జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతుండగా.. జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో వైరల్‌ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. జలుబు, దగ్గు, కీళ్లనొప్పులతో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని పిల్లల విభాగం, పెద్దల జ్వరాల వార్డులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొందరికి రక్తంలో ప్లేట్‌లెట్లు, తెల్ల రక్తకణాలు తగ్గిపోతుండడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్ల సంఖ్యనే కాకుండా ఔట్‌పేషేంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత పది రోజులుగా నిత్యం వెయ్యికి పైగా ఔట్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.

చిన్నారులపై తీవ్ర ప్రభావం

జ్వర బాధితుల్లో ఎక్కువగా చిన్నారులు, వృద్ధులే ఉంటున్నారు. జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే స్పందించి గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామీణులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement