చలితో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

చలితో జాగ్రత్త

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

చలితో జాగ్రత్త ● జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ విద్యుత్‌ సరఫరా మరింత మెరుగు పారిశుధ్య కార్మికుల నిరసన

● జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌

సిరిసిల్ల: చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులు.. పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ సోమవారం తెలిపారు. చలి తీవ్ర త, జాగ్రత్తలను వివరించారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని వృద్ధులు, చిన్నారుల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఏర్పడే నిమోనియా బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గాలి ద్వారా సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించి తెల్ల రక్తకణాలను నిర్వీర్యం చేయడంతో రోగనిరోధక శక్తి తగ్గుతుందన్నారు. చిన్నపిల్లలకు స్వెట్టర్లు వేయాలన్నారు. ఉదయం కాసేపు ఎండలో ఉంచాలన్నారు. చేతులకు గ్లౌసులు, హెల్మెట్‌, స్వెట్టర్లు ధరించాలని సూచించారు.

గంభీరావుపేట: విద్యుత్‌ సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాక్యూమ్‌ సర్క్యూట్‌ బ్రేకర్ల(వీసీబీఎస్‌)లతో ఫీడర్ల రక్షణ పటిష్టం కానుందని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లి సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రెండు వీసీబీఎస్‌లను సోమవారం ప్రారంభించి మా ట్లాడారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు వేగంగా స్పందించడంతో పాటు సురక్షితమైన స్విచ్చింగ్‌ కార్యకాలాపాలు నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. తద్వారా విద్యుత్‌ సరఫరా నాణ్యత, విశ్వసనీయత మెరుగుపడి వినియోగదారులకు మెరుగైన సేవలు అందనున్నాయన్నారు. రాజుపేటలో ఏబీ కేబుల్‌ మార్పిడి చేశామని, ముచ్చర్లలో విద్యుత్‌ సరఫరా సామర్థ్యం మెరుగుపరిచేందుకు రెండు 100 కేవీఏ సామర్థ్యం గల డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌, డీఈ అంజయ్య, ఏడీఈ రమేశ్‌, ఏఈ ఆనంద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: మున్సిపల్‌ ఎదుట సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు సోమవారం నిరసన తెలిపారు. నల్గొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 45వ డివిజన్‌ ప్రకాశం బజార్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికురాలు చందుపట్ల రమణమ్మపై దాడి ఘటనపై నిరసన తెలిపారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కాసారపు శంకర్‌, విజయ, లక్ష్మి, ఉమ, ఏసవ్వ, భారతి, దేవవ్వ, మమత, దేవరాజు, నరేష్‌, శ్రీనివాస్‌, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్ల ఫలితాలు వెల్లడి

సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలను జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సోమవారం ప్రకటించారు. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను నోటీస్‌బోర్డుపై అంటించినట్లు తెలిపారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.30 గంటలలోపు కార్యాలయంలో సమర్పించాలన్నారు. 55 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు 41 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో విత్‌హోల్డ్‌లో ఉంచామని, వేములవాడ పరిధిలో మూడు స్థానాల్లో అభ్యర్థులు లేనందున, సిరిసిల్ల ఐడీసీఎస్‌ పరిధిలో పది స్థానాలలో రిజర్వ్‌ చేయబడిన అభ్యర్థులు లేనందున ఖాళీగా ఉన్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement