సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 125 రోజులుగా నిత్య జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జాతీయ జెండా ఆవిష్కరించే అవకాశం ప్రముఖులకు లభిస్తుంటుంది. కానీ సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థి తండ్రి రమేశ్ శుక్రవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ తెలిపారు. కళాశాల అధ్యాపకులు సామల వివేకానంద, కనకయ్య, రాజయ్య, చంద్రమౌళి, విజయ, రాజశేఖర్, సుజాత, నర్మద పాల్గొన్నారు.


