విద్యార్థులకు వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు వసతులు కల్పించాలి

Nov 21 2026 12:02 AM | Updated on Nov 21 2026 12:02 AM

విద్యార్థులకు వసతులు కల్పించాలి

సిరిసిల్ల అర్బన్‌: గురుకుల విద్యార్థులకు చలి నుంచి రక్షణ కల్పించడంతోపాటు మౌలిక వసతులు కల్పించానలి బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ కోరారు. శుక్రవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ట్లు తెలిపారు. నాణ్యమైన దుప్పట్లు పంపి ణీ చేయాలని, ఉదయం వేడినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. శ్రీనివాస్‌, బల్యాల ప్రవీణ్‌, చెట్టిపెల్లి హరీశ్‌, మారం కార్తికేయ, సాయిచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ఇల్లంతకుంట: కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌ కోరారు. మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అనిల్‌కుమార్‌, అంజలి, హరీశ్‌, నవీన్‌కుమార్‌, దివ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement