డిగ్రీ కాలేజీని నిలబెట్టారు | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ కాలేజీని నిలబెట్టారు

Nov 21 2026 12:02 AM | Updated on Nov 21 2026 12:02 AM

డిగ్రీ కాలేజీని నిలబెట్టారు ● రూ.1.30లక్షలు అందించిన టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత పేదలకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీయాక్టు పెట్టాలి’ ● డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి

● రూ.1.30లక్షలు అందించిన టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట ప్రాంత విద్యార్థులు, యువకుల పోరాటాలతో సాధించుకున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని శాతవాహన యూనివర్సిటీ ఫీజు చెల్లించేందుకు ఇబ్బందిపడగా తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) చీఫ్‌ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. ఈనెల 16న ‘సాక్షి’లో ‘డిగ్రీ కాలేజీ.. పైసలు లేక పరేషాన్‌’ శీర్షికతో కాలేజీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని కళాశాల పరిరక్షణ సభ్యుడు రంజిత్‌, టీఆర్‌ఎస్‌ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి మజీద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పార్టీ చీఫ్‌ కవితకు వివరించగా వెంటనే శాతవాహన యూనివర్సిటీకి బకాయిపడ్డ రూ.1.30లక్షలు మొత్తాన్ని శుక్రవారం చెల్లించి కళాశాలకు అండగా నిలిచారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ శంకర్‌, అధ్యాపకులు, విద్యార్థులు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే కథనంపై స్పందించిన ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ రాధారపు సత్యం తనవంతుగా రూ.20వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్‌లోనూ కళాశాలకు అవసరమైన సహాయం అందించి, అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ నాయకులు అల్లె శంకర్‌, కదిరె రేణుక, మౌనిక, జావిద్‌, కదిరె భాస్కర్‌, శ్రీహరి, సాయిప్రేమ్‌, సత్యంరెడ్డి, రాజేశ్‌, హాజీబాబా, భూపతి, అరుణ్‌రెడ్డి, షభాన, మల్లవ్వ, దేవేంద్ర, పరుశరాములు, అంకూస్‌ పాల్గొన్నారు.

ఇల్లంతకుంట: నిరుపేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని వెల్జీపురంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. వెల్జీపురం సర్పంచ్‌ నాయిని నవీన్‌కుమార్‌, మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో శశికళ, గుండ వెంకటేశం, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పుష్పలత, ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌ మామిడి రాజు పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను నిండా ముంచిన విత్తన సంస్థ యజమానిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జి గుంటి వేణు డిమాండ్‌ చేశారు. సుభాష్‌నగర్‌లోని కార్మిక భవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతులను ముంచిన సదరు విత్తన కంపెనీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసి, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సోమ నాగరాజు, అంజిరెడ్డి పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

సిరిసిల్లటౌన్‌: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు అవురం సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ వాయిదాలు, బకాయి బిల్లులు విడుదల చేయాలని, సీపీఎప్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని కోరారు. బూర సదానందం, వంగ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement